సినిమాలు ప్లాప్ అయ్యాయంటే చాలామంది దర్శకులు, హీరోలు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటారు కానీ.. నిర్మాతల నష్టాల గురించి ఆలోచించరు. కానీ కొంతమంది హీరోలు, దర్శకులు నిర్మాతల కష్టాలను తమ కష్టాలుగా భావించి పారితోషికాలను త్యాగం చేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు.
కానీ ఇప్పుడొక దర్శకుడు తన సినిమా వలన నిర్మాత నష్టపోవడం చూసి తన పారితోషికంతో సగం నిర్మాతకు వెనక్కి తిరిగి ఇవ్వడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. అతనెవరో కాదు దర్శకుడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ రీసెంట్ గా తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ అనుకున్న అంచనాలు అందుకోలేక పూర్తిగా నిరాశపరిచింది. దానితో నిర్మాత భారీగా నష్టపోయారు.
దానితో హరీష్ శంకర్ అందరూ మెచ్చుకునేలా ఓ నిర్ణయం తీసుకుంటున్నాడట. అదే తన పారితోషికంతో సగం అంటే ఆరు కోట్లు నిర్మాతకు వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటున్నారట. అందులో ఇప్పటికే రెండు కోట్లు తిరిగి ఇచ్చేసిన హరీష్ శంకర్ ఆ మిగతా నాలుగు కోట్లు తదుపరి సినిమా పారితోషికలో తగ్గించుకోమని నిర్మాతకు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దానితో అందరూ హరిష్ శంకర్ మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
మరోపక్క హీరో రవితేజ మాత్రం ఆ విషయం తనకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. తన RT 75 చిత్ర షూటింగ్ లో ప్రమాదం జరగగా అతని చేతికి చిన్నపాటి సర్జరీ జరగడంతో ఆయన ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు.