Advertisementt

బిగ్ బాస్ 8: 1st వీక్ నామిషన్స్ లీక్

Wed 04th Sep 2024 11:57 AM
bigg boss  బిగ్ బాస్ 8: 1st వీక్ నామిషన్స్ లీక్
Bigg Boss 8: 1st Week Nominations Leaked బిగ్ బాస్ 8: 1st వీక్ నామిషన్స్ లీక్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ పట్టిపీడిస్తున్న లీకులు ఈ సీజన్ ని వదల్లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ నుంచి నామినేషన్స్ ప్రక్రియ మొదలు వారం వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ వరకు అన్నీ లీకుల ద్వారా బయటికొచ్చేస్తున్నాయి. గత కొన్ని సీజన్స్ ని ఈలీకులు షోస్ పై క్రేజ్ లేకుండా చేసాయి. ఇప్పుడు సీజన్ 8 ని కూడా ఆ లీకులు వేధిస్తున్నాయి. 

ఈ సీజన్ మొదలై మూడు రోజులు కాలేదు. గత ఆదివారమే 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. వారు అప్పుడే ఆడియన్స్ అటెన్షన్ కోసం రచ్చ స్టార్ట్ చేసేసారు. హౌస్ లో కిచెన్ విషయంలో గొడవలు పెట్టుకుంటూ హైలెట్ అయ్యే ప్లాన్ చేసారు. అది ఇంప్లిమెంట్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ ను చేపల మర్కెట్ చేసేసారు. 

ఈ మంగళవారం రాత్రి మొదలైన నామినేషన్ ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగుతుంది. రాత్రి 9.30 కి ప్రసారమయ్యే బిగ్ బాస్ 8 ఎపిసోడ్ లో భాగంగా ఈరోజు నామినేట్ అయ్యే వారి పేర్లు లీకులు ద్వారా బయటికి వచ్చేసాయి. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారెవరంటే.. శేఖర్ భాష, పృథ్వి, నాగమణికంఠ, విష్ణు ప్రియా, బెబక్క, సోనియా నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నట్లుగా లీకులు చెబుతున్నాయి. 

Bigg Boss 8: 1st Week Nominations Leaked:

Bigg Boss Telugu 8 update 

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ