గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో ఈ నెల 27 న విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 పై భారీ అంచనాలున్నాయి. దేవర నుంచి వస్తోన్న ఒక్కొక్క అప్ డేట్ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ దర్శకత్వంలో వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అవగా.. దావుది సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది.
తాజాగా దేవర బ్యాక్ డ్రాప్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. గతంలో అంటే 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో కొంతమంది దళితులను అగ్ర వర్ణాలకు చెందినవారు హత్య చేసిన ఘటన అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది. నీళ్లను వాడుకునే విషయమై మొదలైన గొడవ పెద్దదిగా మారి హత్యల దాకా దారి తీసింది. అంతేకాదు మహిళలు అత్యాచారానికి గురికావడంతో కారంచేడు ఒక్కసారిగా భగ్గుమంది.
అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. రాజకీయంగానూ పెను దుమారం రేపిన ఈ వివాదం అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ఇప్పుడు దేవర కోసం ఇదే సంఘటనను ఆధారంగా కొరటాల శివ తీసుకుని.. దేవరలో ఎన్టీఆర్-విలన్ సైఫ్ అలీ ఖాన్ ల కేరెక్టర్స్ ని డిజైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
పూర్తిగా ఫ్యాక్షన్ గా కాకుండా సముద్రం ఒడ్డున జరిగే ఊచకోతగా దేవర ని తెరకెక్కించారని చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే.