Advertisementt

ఈ వారం థియేట్రికల్ రిలీజెస్

Sat 14th Sep 2024 04:44 PM
the goat,this week,movies  ఈ వారం థియేట్రికల్ రిలీజెస్
This Week Release Movies List ఈ వారం థియేట్రికల్ రిలీజెస్
Advertisement
Ads by CJ

గత వారం నాని సరిపోదా శనివారంతో పాటుగా చిన్న సినిమాలైన అహో విక్రమార్క వంటి సినిమాలు విడుదలైనా.. నాని సరిపోదా శనివారం మాత్రం సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది. కానీ మధ్యలో రెండు తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వదలకపోయినా సరిపోదా శనివారం కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. 

ఇక ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వినాయక చవితి స్పెషల్‌గా పలు సినిమాలు లైన్‌లోకి వచ్చేశాయి. అందులో త‌మిళ సూప‌ర్ స్టార్‌ విజ‌య్ న‌టించిన The GOAT ఈనెల 5న అంటే రెండురోజుల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ విడుద‌ల చెయ్యడంతో అందరిలో మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. 

ఇక తెలుగు స్ట్రయిట్ మూవీ రానా దగ్గుబాటి సమర్పణలో నివేత థామస్ నటించిన 35- చిన్న క‌థ కాదు, జ‌న‌క అయితే గ‌న‌క‌, ఉరుకు పటేల వంటి చిత్రాలూ విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. 35- చిన్న క‌థ కాదు ఈ నెల 6న విడుదలవుతుంది. ఆ తర్వాతరోజు జ‌న‌క అయితే గ‌న‌క‌, ఉరుకు పటేల చిత్రాలు విడుద‌ల కానున్నాయి. వినాయ‌క చ‌వితి సెల‌వ‌లు ఈ చిత్రాలకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. చూద్దాం.. ఈ వారం ఏ సినిమా ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసే చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో...

This Week Release Movies List:

The Goat, 35 Chinna Katha Kaadu, Janaka Ayithe Ganaka, Uruku Patela are Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ