Advertisementt

వైజాగ్‌లో బాలయ్య వారసుడి ట్రైనింగ్

Tue 03rd Sep 2024 04:26 PM
mokshagna,balakrishna son  వైజాగ్‌లో బాలయ్య వారసుడి ట్రైనింగ్
Mokshagna Acting Training at Vizag వైజాగ్‌లో బాలయ్య వారసుడి ట్రైనింగ్
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఉత్కంఠ వీడింది. మూడు నెలల్లో మోక్షజ్ఞ డెబ్యూ సినిమా మొదలు కాబోతున్నట్టుగా నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. మోక్షజ్ఞ‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ బాలయ్య చెప్పడం నందమూరి అభిమానులను సంతోషపరిచింది.

అందరిలా వారసుడిని సినిమా రంగానికి పరిచయం చేసే విషయంలో తనకెలాంటి టెన్షన్ లేదు, కూల్‌గానే కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యబోతున్నట్టుగా బాలయ్య చెప్పారు. ఆదివారం బాలకృష్ణ 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకల్లో మోక్షజ్ఞ కానరాలేదు. అంత పెద్ద ఈవెంట్‌లో బాలయ్య వారసుడు కనిపిస్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మోక్షు జాడ లేదు.

అయితే మోక్షజ్ఞ ఫోటో షూట్ ఈమధ్యన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మోక్షజ్ఞ‌పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. అదే విషయాన్ని బాలయ్య కూడా చెప్పారు. కొడుకు ఇంకా మొదటి సినిమా చెయ్యకుండానే స్టార్ అయ్యాడంటూ కామెంట్ చేశారు. అయితే మోక్షజ్ఞ ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నాడట.

అక్కడ మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా సమాచారం. మోక్షజ్ఞ ఇప్పటికే లుక్ విషయంలో హీరోగా మేకోవర్ అయ్యాడు. మోక్షు లుక్ చూసి నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు, ఇక నటనలోనూ మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసి వారు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఈ లెక్కన పర్ఫెక్ట్ గా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య సర్వం సిద్ధం చేస్తున్నారన్నమాట. 

Mokshagna Acting Training at Vizag:

Balakrishna About His Son Mokshagna Cine Entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ