Advertisementt

దీపికా పదుకొనె బేబీ బంప్ పిక్స్ వైరల్

Tue 03rd Sep 2024 01:56 PM
deepika padukone,baby bump  దీపికా పదుకొనె బేబీ బంప్ పిక్స్ వైరల్
Deepika Padukone Baby Bump Photos Goes Viral దీపికా పదుకొనె బేబీ బంప్ పిక్స్ వైరల్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె.. సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బేబీ బంప్‌తో ఆమె ప్రత్యేకంగా ఫొటోషూట్ చేయించుకోవడం విశేషం. ఈ ఫొటోషూట్‌లో తన భర్త రణ్వీర్ సింగ్ కూడా.. భార్య దీపికపై తన ప్రేమను ఒలకపోస్తున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా దీపిక షేర్ చేశారు.

దీపికా పదుకొనె ఇటీవల చేసిన కల్కి 2898 AD చిత్రంలోనూ ప్రెగ్నెంట్ ఉమెన్‌గానే కనిపించింది. ఆమె కడుపులో భగవంతుడు ఉన్నట్లుగా నాగ్ అశ్విన్ ఆమె పాత్రను డిజైన్ చేశాడు. ఆమె పాత్రకు సంబంధించి పెద్దగా రివీల్ చేయకపోయినా.. సినిమాలో ఎలా అయితే ప్రెగ్నెంట్ లేడీగా కనిపించిందో.. సేమ్ టు సేమ్ ఇప్పుడీ బేబీ బంప్ ఫొటోషూట్‌లోనూ ఆమె అలాగే దర్శనమిస్తోంది.

తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ఆమె తన బేబీ బంప్‌ని ఎంజాయ్ చేస్తోంది. నిజంగా ఓ స్టార్ హీరోయిన్ ఇలా కనిపించడానికి ఘట్స్ కావాలి. కానీ, దీపికా అమ్మగా ప్రమోషన్ పొందబోతున్నాననే ఆనందం, ఓ బిడ్డకు జన్మనిస్తున్నాననే సంతోషాన్ని ఈ ఫొటోల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చూస్తున్నట్లుగా.. ఈ ఫొటోలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Deepika Padukone Baby Bump Photos Goes Viral:

Deepika Padukone Shares Her Baby Bump Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ