Advertisementt

కమల్-సల్మాన్ కాంబో మూవీ ఫిక్స్

Tue 03rd Sep 2024 12:20 PM
kamal haasan,salman khan,atlee  కమల్-సల్మాన్ కాంబో మూవీ ఫిక్స్
Movie in Kamal Haasan and Salman Khan Combo కమల్-సల్మాన్ కాంబో మూవీ ఫిక్స్
Advertisement
Ads by CJ

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగానే కాదు.. కల్కి 2898 AD లాంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్‌తో అద్దరగొట్టేస్తున్నారు.  తాజాగా కమల్ హాసన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి ఓ సినిమాకి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. సెన్సేషనల్ తమిళ్ డైరెక్టర్ అట్లీ ఈ కాంబోకి డైరెక్షన్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 

షారుఖ్ ఖాన్‌తో జవాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ నెక్స్ట్ మూవీపై చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. ఈమధ్య అట్లీ-అల్లు అర్జున్ కాంబో‌లో మూవీ అనే వార్తలు వచ్చినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సల్మాన్ ఖాన్-కమల్ హాసన్ కలయికలో సన్ పిక్చర్స్ నిర్మాణ సారధ్యంలో ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తమిళ దర్శకుడు మురుగదాస్‌తో సికిందర్ యాక్షన్ ఫిలిం‌లో నటిస్తున్నాడు. అటు కమల్ హాసన్ కల్కి చిత్రంతో పాటుగా మరిన్ని తమిళ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. మరి కమల్-సల్మాన్ -అట్లీ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే ఆత్రుత కోలీవుడ్ నుంచి నార్త్ ఆడియన్స్ వరకు కనిపిస్తుంది. మరి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో.. వెయిట్ అండ్ సీ..

Movie in Kamal Haasan and Salman Khan Combo:

Kamal Haasan and Salman Khan Combo Film in Atlee Direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ