హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యని మోసం చేశాడు అంటూ లావణ్య మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాజ్ తరుణ్ తనని వదిలేసి మరో హీరోయిన్ (మాల్వి మల్హోత్రా)తో తిరుగుతున్నాడంటూ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో కూర్చుని డిబేట్స్ పెట్టడమే కాదు.. తన లాయర్ దిలీప్ సుంకరతో కలిసి కోర్టుకు ఎక్కింది.
ఈ విషయంలో రాజ్ తరుణ్ ముందు నుంచి మీడియా ముందుకు రాకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చినా మధ్యలో మీడియాకి చెప్పాల్సినవి చెప్పాడు. తాజాగా మరోసారి రాజ్ తరుణ్ లావణ్య విషయమై ఇండైరెక్ట్‌గా మాట్లాడాడు. నిజం ఏంటనేది నాకు తెలుసు. వంద రకాల సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ముందు పెట్టినా.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. వారికి నచ్చింది మాత్రమే వారు నమ్ముతారు.
అందుకే నేను సంతోషంగా ఉన్నానా, లేదా అనేది నాకు కావాలి. నాకు మీడియా ముందు మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు. కేసు కోర్టులో ఉంది. నేను అక్కడే తేల్చుకుంటాను. అందుకు కావాల్సిన సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. అంతేకాని మీడియా ముందుకు వచ్చి వీళ్లది తప్పు, వాళ్లది తప్పు అని చెప్పడం నాకు నచ్చదు అంటూ రాజ్ తరుణ్.. లావణ్య విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నమైతే చేశాడు.