మెగాస్టార్ చిరంజీవికి-బాలకృష్ణకి మధ్యన అంత స్నేహ బంధం ఉండదు, మెగాస్టార్‌ని బాలయ్య వ్యతిరేకిస్తారు, గతంలో జగన్‌ని కలవడానికి చిరు బృందం వెళ్ళినపుడు కూడా బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకకు కూడా చిరు రాకపోవచ్చనేలా ప్రచారం జరిగింది. కానీ చిరు ముఖ్య అతిధిగా బాలయ్య ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.
అంతేకాదు, బాలకృష్ణ తన 50ఇయర్స్ ఇండస్ట్రీ వేడుక సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా-అల్లు ఫామిలీస్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరు కొడుకు చరణ్, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్‌తో చాలా సరదాగా ఉంటాను అని, అల్లు అరవింద్ కోసమే అన్ స్టాపబుల్ చేశాను అని చెప్పిన బాలయ్య.. తాము తరుచు కలుసుకోమని, అందుకే మా మధ్యన ఏదో జరిగిందని అంతా అనుకుంటూ ఉంటారని తెలిపారు.
ఈమధ్యన అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్‌కు కూడా తాను వెళ్లానని.. ఆ సమయంలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో చాలాసేపు మాట్లాడటం జరిగిందని బాలకృష్ణ తెలిపారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నందువలన ఎక్కువగా కలవము, కానీ ఏదైనా అకేషన్‌లో కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటామంటూ బాలయ్య మెగా-అల్లు ఫామిలీస్‌తో ఉన్న అనుబంధాన్ని రివీల్ చేశారు.