సీనియర్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు ఆ కిక్కే వేరు అన్నట్టుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు కలిసి కనిపిస్తే అభిమానులకు అసలైన పండగే. నిన్న ఆదివారం బాలకృష్ణ 50 ఏళ్ళ సినిమా స్వర్ణోత్సవంలో బాలయ్యను విష్ చెయ్యడానికి మెగాస్టార్ చిరు, వెంకటేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
బాలకృష్ణను ప్రశంసిస్తూ చిరు, వెంకీ మాట్లాడమే కాదు.. బాలయ్యతో కలిసి చిరు-వెంకీ వేడుకను పంచుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే సీనియర్ హీరోల గ్రూప్ పిక్ లో నాగార్జున మిస్ అవడం అభిమానులను నిరాశ పరిచింది. ఈ వేదికకు నాగార్జున హాజరవుతారని అన్నప్పటికీ.. ఆయన బిగ్ బాస్ కార్యక్రమం వలన హాజరవలేదు అని తెలుస్తుంది.
బాలకృష్ణ 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలకు నాగ్ హాజరైతే నందమూరి-అక్కినేని అభిమానులు చాలా సంతోషపడిపోయేవారు. కారణం బాలయ్యకు నాగ్‌కు మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ అనే మాట ఇప్పుడు కాదు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. అందుకే బాలయ్యతో నాగ్ కనిపిస్తే అది ఆయా అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్‌కు కూడా కన్నుల పండుగే.