మెగా హీరో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరుపై మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ చాలా ఆక్రోశంగా ఉండడమే కాదు, మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్ పై చాలామంది కోపాన్ని చూపిస్తున్నారు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి భార్య స్నేహ ఫ్రెండ్ భర్త అయిన వైసీపీ కేండిడేట్‌కి సపోర్ట్ చేయడంపై మెగా-పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.
రీసెంట్‌గా అల్లు అర్జున్ నచ్చితే వెళతాను, నచ్చితే చేస్తానంటూ చేసిన కామెంట్స్ పై జనసేన కార్యకర్తలు, ఎమ్యెల్యేలు కూడా అల్లు అర్జున్‌పై విరుచుకుపడుతున్నారు. ఆ సందర్భంలోనే అల్లు-మెగా వార్ సోషల్లో మీడియాలో పీక్స్ లోకి వెళ్ళిపోయింది.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా విష్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu అంటూ అల్లు అర్జున్ పవన్ కి బర్త్ డే విషెస్ తెలియజేశాడు.
అయితే అల్లు అర్జున్ విషెస్ ట్వీట్ కింద పవన్ ఫ్యాన్స్ ఈ విధంగా కామెంట్స్ పెడుతున్నారు.
Thank you Nandyal ex MLA Wife gari friends gari husband garu అని వెటకారంగా కొంతమంది స్పందిస్తే మరికొందరు అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి థాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇస్తున్నారు.