నిన్న ఆదివారం హైదరాబాద్ లో జరిగిన బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వెంకటేష్ ఇంకా యంగ్ హీరోస్ నాని, రానా, సిద్దు, విజయ్ దేవరకొండ తదితరులు హాజరైన ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి, బాలయ్యతో యాక్షన్ ఫిల్మ్ చెయ్యాలనే కోరికను ఆయన ఈ వేడుక లో బయట పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు.
నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా జరగదు. అందరం కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు.
50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య.. అంటూ చిరు మట్లాడారు.