Advertisementt

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య హాట్ కామెంట్స్

Mon 02nd Sep 2024 12:50 PM
balakrishna  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య హాట్ కామెంట్స్
Balayya comments on Mokshajna entry మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశ విషయంలో గత మూడు నెలలుగా తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆల్మోస్ట్ ఫిక్స్, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ప్రశాంత్ వర్మ తలమునకలై ఉన్నాడు. అయితే కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై గత మూడేళ్ళుగా బాలయ్య మౌనంగా ఉన్నారు. 

తాజాగా బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొడుకు ఎంట్రీపై చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా వైరల్ అయ్యాయి, మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మోక్షజ్ఞ నటించిన మొదటి సినిమా మొదలై, రిలీజ్ కాకుండానే వాడు స్టార్ అయిపోయి కూర్చున్నాడు. మేము ఎంతో కష్టపడి స్టార్స్ అయ్యాము. కానీ నా కొడుకు మోక్షజ్ఞ ఒక్క సినిమా కూడా చేయకుండానే స్టార్ అయిపోయాడు. మరో మూడు నెలల్లో మోక్షజ్ఞ మొదటి సినిమా మొదలవుతుంది అంటూ బాలయ్య సూపర్ అప్ డేట్ ఇచ్చారు. 

అంతేకాకుండా నా కొడుకును హీరోగా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. అది నాకు చాలా ఈజీ. చాలామంది తమ పిల్లల ఫ్యూచర్ గురించి కలలు కనడమే కాదు చాలా ప్రణాళికలు వేస్తుంటారు. ఎంతో ఆరాటపడుతుంటారు. ఆ సమయంలో కొడుకు భవిష్యత్తుపై ఎంతో టెన్షన్ అనుభవిస్తుంటారు. కానీ నాకు అదేమీ లేదు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి అంటూ బాలకృష్ణ వారసుడి సినిమా విషయంలో ఎంత కాలారిటీతో ఉన్నారో చెప్పుకొచ్చారు. 

Balayya comments on Mokshajna entry:

Balayya interesting comments on Mokshajna entry

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ