Advertisementt

దేవర: జస్ట్ 25 డేస్ టు గో..

Mon 02nd Sep 2024 12:01 PM
devara   దేవర: జస్ట్ 25 డేస్ టు గో..
Planning is essential for Devara దేవర: జస్ట్ 25 డేస్ టు గో..
Advertisement
Ads by CJ

దేవర పార్ట్ 1 విడుదలకు ఇంకా 25 డేస్ మాత్రమే ఉంది. మరి దేవర షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా వున్నా టీమ్ ఎప్పుడు దేవర ప్రమోషన్స్ మొదలు పెడుతుంది అనే మాట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దేవర ప్రమోషన్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన భార్య, తల్లితో కలిసి కర్ణాటక ఆలయాల్లో స్పెషల్ పూజలు నిర్వహిస్తున్నాడు. 

ఉడిపీ, ఇంకా కొన్ని దేవాలయాల్లో  రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ తో కలిసి ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతితో స్పెషల్ పూజలు చేస్తూ గత రెండు రోజులుగా చాలా హడావిడిగా కనిపిస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదలకు రెడీ అవుతూ ఉంది. కానీ ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి గా కనిపిస్తున్నారు. 

ఎన్టీఆర్ కర్ణాటక నుంచి రాగానే అంటే సెప్టెంబర్ రెండో వారం నుంచి దేవర ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట. రెండో వారం అంటే ప్రమోషన్స్ తూతూ మంత్రంగా ముగించేస్తారేమో అని ఫ్యాన్స్ భయం. ముంబైలో ఎక్కువగా దేవర ప్రమోషన్స్ చేపట్టాలని టీమ్ చూస్తుంది అంటున్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఇలా దేవర టీమ్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ను, ఇంటర్వ్యూస్ ను ప్లాన్ చేస్తున్నారట. మరి ప్లాన్ చెయ్యడమే కాదు అవి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేలా చూడాలి. 

గతంలోనూ చాలామంది స్టార్ హీరోలు ఇలానే సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేసారనే ప్రచారం జరిగినా అది మేకర్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చెయ్యలేదు. ఇప్పుడు దేవర విషయంలోనూ అదేదో జరిగిద్దెమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన. 

Planning is essential for Devara:

Devara: Just 25 days to Go

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ