Advertisementt

పవన్ ఫ్యాన్స్‌కి ఇది చాలా స్పెషల్

Mon 02nd Sep 2024 10:19 AM
pawan kalyan  పవన్ ఫ్యాన్స్‌కి ఇది చాలా స్పెషల్
Pawan Kalyan Birthday special పవన్ ఫ్యాన్స్‌కి ఇది చాలా స్పెషల్
Advertisement
Ads by CJ

ప్రతి ఏడాది పవర్ స్టార్ బర్త్ డే లు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. ఆయన అభిమానులు పవన్ బర్త్ డే కి కేక్ కటింగ్స్, బ్యానర్లు కట్టి హడావిడి చేస్తూ పవన్ కటౌట్ కి పూల దండలు వేసి పాలాభిషేకాలు చేస్తారు. పవర్ స్టార్ బర్త్ డే కి ఆయన నటించే సినిమాల నుంచి వదిలే అప్ డేట్స్ కూడా ఫ్యాన్స్ కి ప్రత్యేకమే. ఇది కామన్. 

కానీ ఈ ఏడాది మాత్రం అలా కాదు.. పవన్ కళ్యాణ్ కి ఈ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. గత పదేళ్లుగా రాజకీయాల్లో జీరోగా కనిపించిన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అంటే 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను 21 మందిని గెలిపించుకుని ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. సీఎం చంద్రబాబు తర్వాత స్థానంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. 

పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలు మోస్తూ ఏపీ ప్రజల సంకేశం కోసం శ్రమిస్తున్నారు. చంద్రబాబు కు రాజకీయాల్లో ఉన్న అనుభవం పవన్ కి లేకపోయినా.. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుని కూలంకషంగా అధికారులతో పనులు చేయిస్తూ కార్యసాధకుడిలా మారిపోయారు. అటు సినిమా షూటింగ్ కి కూడా సమయాన్ని కేటాయించేందుకు సిద్ధమయ్యారు. 

తమ స్టార్ హీరో అటు రాజకీయాలను శాసిస్తూ, ఇటు సినిమాలను వదలకపోవడం పవన్ ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది బర్త్ డే పవన్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ అని చెప్పేది. ఇక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమా అప్ డేట్స్ తో మోత మొగడానికి రెడీ అయ్యింది. 

Pawan Kalyan Birthday special :

Pawan kalyan birthday Special article 

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ