నార్త్ లో బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ సౌత్ లో లేదనే చెప్పాలి. మొదట్లో ఎన్టీఆర్ హోస్ట్ గా చేసినప్పుడు మాత్రం బుల్లితెర ప్రేక్షకులు తెలుగు బిగ్ బాస్ ని బాగా ఆదరించారు. స్టార్ మా కి మంచి రేటింగ్స్ వచ్చాయి. నాని హోస్ట్ గా చేసిన సీజన్ కి, నాగార్జున స్టార్ట్ చేసిన మూడో సీజన్ వరకు బాగానే ఉంది. సెలబ్రిటీస్ వచ్చారు, ప్రేక్షకుల ఆదరణ బావుంది.
కానీ సీజన్ 4 నుంచి బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడానికి కారణం.. షో అంతా స్క్రిప్టెడ్ అంటూ ప్రచారం జరగడం, సెలబ్రిటీస్ ఎవరూ బిగ్ బాస్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడం ఇవన్నీ షో పై ఆదరణ తగ్గేలా చేసాయి గత రెండు సీజన్ మరీ నీరసంగా, చప్పగా కదిలాయి.
ఇక ఈ సీజన్ కి ఎంతో కొంత హైప్ తేవాలని నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం భావించినా ఈ సీజన్ కి మాత్రం అంతంత మాత్రంగానే షో పై క్రేజ్ కనిపించింది. నిన్న సెప్టెంబర్ 1 న మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ చూస్తే బాబోయ్ అంటారేమో. నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ షోలో నాని, ప్రియాంక, రానా, నివేత థామస్, అనిల్ రావిపూడి లు స్పెషల్ గా కనిపించగా.. హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ ని చూడగానే బుల్లితెర ప్రేక్షకులకు ఆల్మోస్ట్ నీరసం వచ్చేసింది.
కారణం అందరూ సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా లో ఫేమస్ అయిన వారే ఉన్నారు. ఒక్కరు కూడా సినిమా సెలెబ్రిటీ కనిపించలేదు. స్టార్ మా సీరియల్స్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ మాత్రమే ఈ షోలో కనిపించడం నీరసంగా అనిపించకమానదు.