10.00 PM: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే లాస్ట్ పెయిర్ అంటూ నాగ్ అనౌన్స్ చేశారు. కంటెస్టెంట్ నెంబర్ 13ను నాగ్ పిలిచారు. 13వ కంటెస్టెంట్‌గా నైనిక అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అనంతరం స్టేజ్ పైకి వచ్చి తనని పరిచయం చేసుకుంది. తన గురించి తెలుసుకున్న నాగ్.. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మూడు రోజుల్లో ముగ్గురితో బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలని అన్నారు. అనంతరం బడ్డీ కాన్సెప్ట్ చెప్పి.. టాస్క్ ఆడించారు. నైనిక బడ్డీగా, అలాగే లాస్ట్ కంటెస్టెంట్‌గా వరంగల్ కుర్రాడు నబీల్ ఆఫ్రిది ఎంట్రీ ఇచ్చాడు. నబీల్ ఆఫ్రిది గురించి ఏవీ అనంతరం నాగ్‌తో డిస్కషన్ నడిచింది. బడ్డీ కాన్సెప్ట్ చెప్పి.. తన బడ్డీని పిలిచారు. అనంతరం ఇద్దరినీ హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లో పరిచయ కార్యక్రమాలు అనంతరం సంతూర్ సంబరాలు నడుస్తున్నాయి.
ట్విస్ట్: లాస్ట్ 2 పెయిర్‌తో గేమ్ ఆడేందుకు అనిల్ రావిపూడిని నాగ్ ఆహ్వానించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా డిస్కషన్ అనంతరం.. ఆయనని హౌస్‌లోకి పంపించారు నాగ్. హౌస్‌మేట్స్‌తో నాగ్ మాట్లాడుతూ.. బ్యాడ్ న్యూస్ 3 గురించి చెబుతున్నారు. హౌస్‌లోకి అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్‌తో డిస్కస్ చేస్తున్నారు. అనంతరం గేమ్‌లో ఓడిపోయిన పెయిర్స్‌ను పిలిచి అందులో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకువెళ్లబోతున్నట్లుగా అనిల్ రావిపూడి ప్రకటించారు. కంటెస్టెంట్ల ఓట్ల అనంతరం నాగమణికంఠను బయటికి తీసుకెళ్లడానికి అనిల్ సిద్ధమయ్యారు. ఫైనల్‌గా ఇది ఫ్రాంక్ అంటూ అనిల్ ట్విస్ట్ ఇచ్చారు.
లాస్ట్ 2 పెయిర్స్‌తో గేమ్ ఆడించి అనిల్ రావిపూడి వచ్చేశారు. అనంతరం బిగ్ బాస్ మాట్లాడుతూ.. కంటెస్టెంట్‌కి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చెబుతూ ప్రైజ్ మనీ జీరో (బ్యాడ్ న్యూస్) అని అనౌన్స్ చేశారు. ఈ జీరోని లిమిట్ లెస్‌కి తీసుకెళ్లే బాధ్యత కంటెస్టెంట్స్‌కే బిగ్ బాస్ వదిలేశారు. ఫైనల్‌గా నాగ్ హౌస్‌ని లాక్ చేశారు.