9.00 PM: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే 9వ కంటెస్టెంట్ కిరాక్ సీత. ఆమెను కింగ్ నాగ్ స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఆమె గురించి పరిచయం చేశారు. ఆమెకు బడ్డీ కాన్సెప్ట్ చెప్పి.. టాస్క్ చేయించారు. అనంతరం ఆమెను పక్కన వెయిట్ చేయమని చెప్పి.. 10వ కంటెస్టెంట్‌ను ప్రకటించారు. 10వ కంటెస్టెంట్‌గా నాగ మణికంఠను కింగ్ నాగ్ ఆహ్వానించారు. నాగ మణికంఠ లైఫ్ స్టోరీని పరిచయం చేశారు. ఆయన స్టోరీలో ఓ బయోపిక్ కూడా తీయవచ్చని చెబుతూ.. నాగ్ టైటిల్ అడిగితే.. ఆ బయోపిక్‌కు ఆఖరి పోరాటం అనే టైటిల్ పెడతా అన్నారు నాగ మణికంఠ. అనంతరం తన బడ్డీని పరిచయం చేసి హౌస్‌లోకి పంపించారు. అనంతరం సెలబ్రిటీ టైమ్.
సెలబ్రిటీ టైమ్‌లో భాగంగా సరిపోదా శనివారం టీమ్ సందడి చేసింది. నేచురల్ స్టార్ నానితో పాటు ఆ సినిమాలో కళ్లుగా నటించిన ప్రియాంక కూడా ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరితో కాసేపు సినిమా గురించి డిస్కస్ చేసిన నాగ్.. వారిద్దరిని హౌస్‌లోకి పంపించి ఓ గేమ్ ఆడించారు. అనంతరం హౌస్‌లో ఓడిపోయినా వారి చేత బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేయించారు. ఇంతకు ముందు బ్యాడ్ న్యూస్ అంటూ నో టీమ్ లీడర్, నో ఇమ్యూనిటీ అని చెప్పిన నాగ్.. ఈసారి నో రేషన్ అని షాక్ ఇచ్చారు.
9.30 PM: అనంతరం 11వ కంటెస్టెంట్‌ను నాగ్ పిలిచారు. సీరియల్ నటుడు పృథ్వీ రాజ్ 11వ కంటెస్టెంట్‌గా పెర్ఫార్మెన్స్ అనంతరం ఎంట్రీ ఇచ్చారు. అతనికి బడ్డీ కాన్సెప్ట్ చెప్పి టాస్క్ ఆడించారు. అతని బడ్డీగా యాంకర్ విష్ణు ప్రియ 12వ కంటెస్టెంట్‌గా మాస్ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఆమెతో సీజన్ గురించి చెబుతూ.. తన బడ్డీని పరిచయం చేశారు నాగ్. ఇద్దరికీ ఐక్యూ టెస్ట్ విధించి అనంతరం హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లో పరిచయం కార్యక్రమాలు నడుస్తున్నాయి.