Advertisementt

NBK50: బాలయ్య స్వర్ణోత్సవ వేడుక

Mon 02nd Sep 2024 07:44 PM
nbk golden jubilee celebrations  NBK50: బాలయ్య స్వర్ణోత్సవ వేడుక
NBK Golden Jubilee Celebrations NBK50: బాలయ్య స్వర్ణోత్సవ వేడుక
Advertisement
Ads by CJ
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్ తదితరులు పాల్గొన్నారు.
బోయపాటి శ్రీను: తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాలా కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్, ఎటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారికోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్ పెరుగుతుంది.
అనిల్ రావిపూడి: బాలయ్య బాబు గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుండి పుట్టేస్తాయ్, బాడీ లాంగ్వేజ్ నుండి వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయనాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఆయనలా ఉండటం ఆయనకే సాధ్యం.
బుచ్చిబాబు: ఈరోజు ఇంతకంటే మంచి మాట, గొప్ప మాట ఇంకొకటి ఉండదు. జై బాలయ్య
కందుల దుర్గేశ్ (ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్): సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 సంవత్సరాల పాటు యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య సేవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను.
తమన్: అఖండ, వీర సింహారెడ్డి వంటి సినిమాలను నాకు ఇచ్చినందుకు గాను నాకు చాలా సంతోషం, జై బాలయ్య
సుమలత: నేను బాలయ్య గారితో 2 సినిమాలలో నటించాను. బాలయ్య నాకు తెలిసినంత వరకు చాలా సింపుల్‌గా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.

NBK Golden Jubilee Celebrations:

Nandarmuri Balakrishna Golden Jubilee Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ