సరిపోదా శనివారం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి యునానిమస్‌గా హిట్ అనిపించుకుంది. నాని పెర్ఫార్మెన్స్‌కి, ఎస్ జె సూర్య విలనిజాన్ని ఎంజాయ్ చెయ్యడమే కాదు ప్రేక్షకులు బ్రహ్మరధం అపడుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కి, నాని సరిపోదా శనివారానికి సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..
అదేనండి సరిపోదా శనివారంలో విలన్‌గా చేసింది.. గేమ్ ఛేంజర్‌లో నెగెటివ్ కేరెక్టర్ చేసేది ఒక్కరే. ఆయనే ఎస్ జె సూర్య. తమిళ యాక్టర్ అయిన ఎస్ జె సూర్య సరిపోదా శనివారంలో విలన్‌గా అదిరిపోయే నటనతో తెలుగు, తమిళ ఆడియన్స్‌ని మెప్పిస్తున్నారు. సైకో పోలీస్ పాత్రలో సూర్య విలనిజాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోను సూర్య సీఎం కేరెక్టర్‌లో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నారట. అయితే సరిపోదా శనివారం చూశాక సినిమా చూసిన వాళ్ళు సూర్యలోని అసలు విలనిజాన్ని వివేక్ ఆత్రేయ పర్ఫెక్ట్ గా వాడాడు అని అనకమానరు. ఈ విలనిజాన్ని చూశాక గేమ్ ఛేంజర్ లో సూర్య నుంచి అంతకుమించిన పెర్ఫార్మెన్స్‌ని ప్రతి ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తారు.
మరి దర్శకుడు శంకర్, సూర్య కేరెక్టర్‌ని ఎంత నెగెటివ్‌గా డిజైన్ చేసారో అనే విషయంలో ఇప్పుడు మెగా అభిమానులు ఆతృతను చూపిస్తున్నారు. సరిపోదా శనివారం కన్నా సూర్య బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.