సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని నెలలుగా ఫ్యామిలీతో ఫుల్ టైం స్పెండ్ చేస్తూ వెకేషన్స్ అంటూ తెగ తిరిగేస్తున్నారు. రాజమౌళి తో ఒక్కసారి సెట్స్ లోకి వెళితే మహేష్ బాబు కి ఫ్యామిలీతో గడిపే సమయం దొరకదు. అందుకె మహేష్ ఇప్పుడు ఉన్న సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించేసారు. పనిలో పని రాజమౌళి తో చెయ్యబోయే మూవీ కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నారు.
కొద్దిరోజులుగా ఫారిన్ ట్రిప్స్ వేస్తున్న మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేశారు. రాజమౌళి - మహేష్ మూవీ కోసం మహేష్ పూర్తిగా మారిపోయారు. లాంగ్ హెయిర్, గెడ్డం తో ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ నెలలోనే మహేష్-రాజమౌళి మూవీకి ముహూర్తం అంటున్నారు కానీ.. రాజమౌళి కాంపౌండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో మహేష్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి తెరకెక్కించబోయే ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కనుంది. ప్రస్తుతం రాజమౌళి SSMB29 మూవీ ప్రీ ప్రొడక్షన్ లో తలమునకలై ఉండగా మహేష్ బాబు మాత్రం న్యూయార్క్ లో కుమార్తె సితార తో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. రీసెంట్ గానే మహేష్ -సితారలు న్యూయార్క్ వెళ్లారు. అక్కడ న్యూయార్క్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కుమార్తె తో మహేష్ కనిపించారు. ప్రస్తుతం మహేష్-సితార ఫొటోస్ నెట్టింట సంచనంగా మారాయి.