Advertisementt

శృతిహాసన్ కర్రసాము ప్రాక్టీస్

Sun 01st Sep 2024 08:40 PM
shruti haasan,karrasamu  శృతిహాసన్ కర్రసాము ప్రాక్టీస్
Shruti Haasan Karrasamu Practice Video Goes Viral శృతిహాసన్ కర్రసాము ప్రాక్టీస్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ నటి శృతి హాసన్ మధ్యలో కెరీర్‌కి గ్యాప్ ఇచ్చినా మళ్ళీ తెలుగు సినిమాలతో బ్యాక్‌బౌన్స్ అయ్యింది. క్రాక్, వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. సలార్‌తో పాన్ ఇండియా హిట్‌లో భాగమైన శృతి హాసన్ క్రాక్ చిత్రంలో చేసిన యాక్షన్ సీన్స్ కి ఆమె అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.

అందుకే తనకు వచ్చే కేరెక్టర్స్ కోసం శృతి హాసన్ చాలా కష్టపడుతుంది. తాజాగా శృతి హాసన్ కర్రసాము ప్రాక్టీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శృతి హాసన్ కర్ర సాము నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు తన తండ్రి కమల్ హాసన్ కర్రసాములో శిక్షణ తీసుకున్నారు, ఇప్పుడు అదేమాదిరి ఆత్మరక్షణ విద్యలో తానూ శిక్షణ తీనుకుంటున్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

అయితే శృతి హాసన్ కర్రసాము ప్రాక్టీస్ చెయ్యడానికి ప్రధాన కారణం.. ఆమె రజినీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ శృతి హాసన్ కేరెక్టర్‌ని పవర్ ఫుల్‌గా డిజైన్ చేశాడట. అంతేకాదు ఆమె కేరెక్టర్‌కు యాక్షన్ కూడా ఉంటుంది అని, అందుకే శృతి హాసన్ పాత్ర పర్ఫెక్షన్ కోసం కర్రసాము నేర్చుకుంటుంది అని తెలుస్తుంది.

Shruti Haasan Karrasamu Practice Video Goes Viral:

Shruti Haasan Practices Martial Arts for Coolie Shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ