చాలామంది టాలీవుడ్ దర్శకనిర్మాతలు సినిమాల డేట్స్ అనౌన్స్ చేసి మరీ షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. కొంతమంది సినిమా మొదలైనరోజే రిలీజ్ డేట్స్ లాక్ చేస్తున్నారు. ఇంకొందరు సగం షూటింగ్ అయ్యాక అనౌన్స్ చేస్తున్నారు. అయితే డేట్‌ని అన్ని విధాలుగా ఆలోచించి మరీ ప్రకటించే దర్శకులు, నిర్మాతలు ఆ డేట్‌కి సక్రమంగా విడుదల చెయ్యలేక రిలీజ్ డేట్స్‌ని మారుస్తూ పోతున్నారు.
సరే మార్చిన తేదీలను అయినా పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నారా అంటే అదీ లేదు. సినిమా షూటింగ్స్‌ని సినిమా విడుదలకు ముందు వరకు చేస్తూ పోతున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ ప్రమోషన్స్‌కి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరకొచ్చేశాక హడావిడిగా ప్రమోషన్స్ చుట్టేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి సరైన ప్రమోషన్స్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీస్ చాలానే ఉన్నాయి. ఒక్క రాజమౌళి తప్ప ఆ ప్రమోషన్స్ విషయంలో ఏ ఒక్కరు సరైన పద్ధతిలో కనిపించడం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలేవీ సరైన ప్రమోషన్స్ చెయ్యలేదు.
అలాగే ఇప్పుడు మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర పరిస్థితి ఏమిటో అర్ధం కాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నలిగిపోతున్నారు. సినిమాలు ప్రమోషన్స్ లేకపోయినా హిట్ టాక్ వస్తే గట్టెక్కేస్తాయి. అదే టాక్ అటు ఇటుగా అయితే అప్పుడు నష్టపోయేది నిర్మాతలే. అందుకే అనేది రిలీజ్ డేట్ ఇస్తే సరిపోదు.. ప్రమోషన్స్ కూడా ఉండాలి అనేది.!