నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు బ్రతునిచ్చారు. ఆయన గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే..
నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్లినా.. పవన్ కళ్యాణ్‌గారు లేకపోతే.. ఈ క్రేజ్, ఈ స్థాయి ఉండేది కాదు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండే సమయంలో హరీష్ శంకర్.. చింతకాయల రవి సినిమాలో వేషం ఇప్పించి.. అమెరికా పంపించారు.
అలాంటి నన్ను పిలిచి నిర్మాతని చేశారు పవన్ కళ్యాణ్‌గారు. చాలా మంది చాలా మాటలు అన్నారు.. అయినా కూడా ఆయన మాటిచ్చాను అంతే అని అన్నారు. అలాంటి కళ్యాణ్‌గారికి ఈ సందర్భంగా పాదాభివందనం చేసుకుంటున్నాను.
ఈరోజు వాకింగ్ చేస్తుంటే.. ఓ వ్యక్తి సెకండ్ రిలీజ్‌కు కూడా గబ్బర్‌సింగ్‌కు ఈ క్రేజేంటి అని అడిగాడు.
హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమైనదో.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్‌సింగ్ అంత పవిత్రమైనదని చెప్పా.
హరీష్ శంకర్ విషయానికి వస్తే.. కోపానికి, పగకి చాలా తేడా ఉంటుంది. కోపం అనేది నీలపాము లాంటిది.. కానీ పగ నాగపాములాంటిది. నాగపాము కరిస్తే చచ్చిపోతాం. మేమంతా కోప్పడే బ్యాచ్.
ఈ గబ్బర్‌సింగ్ సినిమాకు సంబంధించి ప్రతి కష్టం హరీష్ శంకర్‌దే.
కళ్యాణ్‌గారితో అంతకు ముందు తీన్‌మార్ సినిమా చేశా. ఆయన ఒక్కసారి నమ్మితే అంతే. గబ్బర్‌సింగ్ సినిమాకు హరీష్ ఏం చెబితే.. అదే చేద్దాం అని ఫస్ట్ డే రోజే నాకు కళ్యాణ్‌గారు చెప్పారు.
హరీష్ శంకర్‌ని వాడుకునే వాళ్లకి తెలుస్తుంది ఆయన పవర్ ఏంటో. హరీష్ శంకర్ అనేవాడు సీసాలాంటి వాడు. ఆయనని మలుచుకునే విధానంలోనే అంతా ఉంటుంది.
హరీష్ శంకర్ రాబోయే 25 సంవత్సరాలలో నెంబర్ వన్ డైరెక్టర్‌గా ఉంటాడు.. ఆ విషయం నాకు తెలుసు.
పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. నీతి, నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి. భారతదేశంలో ఏ నటుడు పొందలేని రెమ్యూనరేషన్ పొందగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు జనం కోసం.. కుటుంబాన్ని, పిల్లలని వదిలేసి.. దాదాపు 10 సంవత్సరాల పాటు పోరాడి.. ఈ రోజు ఒకస్థాయికి వచ్చారు.
ఒక స్థాయిలో మాత్రమే ఉన్నారు.. నేను ఆయనని ఎక్కడో ఊహించుకున్నాను.. ఆ స్థాయి వచ్చిన రోజు నేను మాట్లాడతా.
ఈ మధ్య ఒక వ్యక్తి.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా.. ఒక చిన్న పని చేయిస్తావా? అని అడిగాడు. అతన్ని కింద నుంచి పైకి చూశా.. కొందరినీ దూరం నుంచే చూడాలి. దగ్గరకి వెళ్లడానికి ట్రై చేయకూడదు. మనకి అనవసరం అవన్నీ అని చెప్పా.
గబ్బర్‌సింగ్ రీ రిలీజ్ అనుకున్నప్పుడు ఎలా రిలీజ్ చేయాలి. నాకన్నా కళ్యాణ్‌గారిని ప్రేమించే వ్యక్తి ఉండాలని అనుకున్నాను. ఈ సినిమాకు హరీష్, దేవిశ్రీ.. ఇలా ప్రతి ఒక్కరూ ప్రేమించి పనిచేశారు. హీరోగారు ఎంతో కష్టపడ్డారు. అభిమానులు ఈ సినిమాతో కడుపునిండా ఆరగించారు. అలాంటి సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నా.
సత్యన్నారాయణని ఈ సినిమా రీ రిలీజ్‌కు ఎన్నుకోవడానికి కారణం.. నాకంటే ఆయన కళ్యాణ్‌గారికి పెద్ద అభిమాని. అందుకే ఆయన చేతుల్లో ఈ సినిమా పెట్టా.
భారతదేశం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుంటే.. నేను 7 సంవత్సరాలుగా సినిమాలు తీయకుండా కూర్చునా.. నిజంగా తప్పుచేశా. క్షమించండి. నేను సినిమా వాడిని. సినిమాలు తీస్తాను. ఇకపై బ్లాక్‌బస్టర్ సినిమాలు తీస్తా. ఇండస్ట్రీకి బండ్ల గణేష్ అంటే ఏంటో చూపిస్తా.. ఇదే నా సంకల్పం.
Bandla Ganesh Speech at Gabbar Singh Re release Event: