కృతి శెట్టిని ఇంకా ఉప్పెన బ్యూటీగానే చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక్క సినిమాతోనే అందరి మనస్సులో కొలువై ఉన్న కృతి శెట్టి ఆ తర్వాత రెండు చిత్రాలు హిట్ కొట్టినా అటుపిమ్మట వరస వైఫల్యాలతో చాలా ఇబ్బంది పడింది. మళ్ళీ టాలీవుడ్ అవకాశాలు కోసం ఎదురు చూస్తే కస్టడీ, మనమే రూపంలో కృతి శెట్టికి నిరాశే ఎదురైంది.
తాజాగా ఉప్పెన చిత్రం తర్వాత తన ప్లాప్‌ని చాలామంది కోరుకున్నారు అంటూ కృతి శెట్టి చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి. కృతి శెట్టి నాశనాన్ని ఎవరు కోరుకున్నారా అని బేబమ్మ ఫ్యాన్స్ తల పగలుగొట్టుకుంటున్నారు. అదలా ఉంటే కృతి శెట్టి ఈమధ్యన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అయ్యింది.
తరచూ కొత్త కొత్త బ్యూటిఫుల్ ఫొటోస్‌ని షేర్ చేస్తుంది. గ్లామర్‌గా ఉన్న పిక్స్‌తో పాటుగా ట్రెడిషనల్ అండ్ క్యూట్ పిక్స్ వదులుతుంది. తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన పిక్ చూస్తే క్యూట్ కృతి శెట్టి అంటారేమో.. అంత చక్కటి అందంతో బ్యూటిఫుల్‌గా కనిపించింది. రెట్రో లుక్‌తో చిన్న స్మైల్ ఇస్తూ కృతి ఇచ్చిన లేటెస్ట్ ఫోజ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.