సిద్దార్థ్-అదితి రావు లు ఇద్దరూ తమ సీక్రెట్ లవ్ ని నిశ్చితార్ధం వరకు నడిపించారు. సిద్దార్థ్-అదితి రావు లు ఇద్దరూ ఎంగేజ్మెంట్ ని కూడా సీక్రేట్ గానే చేసుకుని ప్రవేట్ పార్టీ అంటూ నిశ్చితార్ధం అయిన విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. అయితే ఎంగేజ్మెంట్ అయ్యి ఎన్ని నెలలు గడుస్తున్నా పెళ్లి విషయంలో మాత్రం ఈ జంట సైలెంట్ గా ఉంటుంది.
అయితే సిద్దు-అదితి లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో అదితి మాత్రం మాది డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు, తమ పూర్వీకుల సంస్థానమైన వనపర్తిలో శ్రీరంగపురం టెంపుల్ లోనే తమ వివాహం అంటూ అదితి పెళ్లి వేదికపై స్పందించింది.
కానీ పెళ్లి డేట్ పై స్పందించకుండా క్యూట్ అండ్ బ్యూటీ ఫుల్ పిక్స్ వదులుతూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా సిద్దార్థ్-అదితి రావు బ్యూటిఫుల్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో కనిపించగానే.. వావ్ సూపర్ క్యూట్ జంట.. అంతా ఓకె గాని.. పెళ్లప్పుడో చెప్పండి అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
నిజంగా సిద్దార్థ్-అదితి రావు ల పిక్ చూస్తే సూపర్ బ్యూటిఫుల్ అనేలా ఉంది. మరి ఈ జంట ఏడడుగులు ఎప్పడు నడుస్తుందో అనేది ఇంకా సస్పెన్స్ గానే కనిపిస్తుంది. ఆ శుభవార్త ఏదో చెప్పేస్తే పోలా..!