వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత తేరుకోవడానికి చాలానే సమయం పట్టింది. వై నాట్ 175 అంటే.. ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా ప్రజలు కేవలం వైసీపీ కి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చక్రం తిప్పడం, చంద్రబాబు కి మోడీ రెడ్ కార్పెట్ పరవడం చూసి మాకు రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు, మమ్మల్ని బీజేపీ వదులుకోదని వైసీపీ నేతలు ప్రగల్బాలు పలికారు.
ఇక వైసీపీ లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ కి బలమనుకున్న నేతలంతా ఇంట్లోనే కూర్చున్నారు. అందులో కొడాలి నాని, రోజా, బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్ ఇలా చాలామంది అసలు వైసీపీ పార్టీలో ఉన్నారా, లేదా అనే అనుమానంలో ప్రజలను ఉంచుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీకి బలమనుకున్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు లు పదవులకు, పార్టీకి రాజీనామా చేసి అధినేతకు షాకిచ్చారు. ఇప్పుడు మరో ఇద్దరు వైసీపీ ఎమ్యెల్సీ రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అంతేకాకుండా ఇంకొంతమంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు, ఎమ్యెల్సీ లు వైసీపీ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీ లోకి జంప్ అవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్యెల్సీలు వెళ్లిపోగా.. ఇకపై ఎవరు పార్టీని వీడుతారు, రేపు జగన్ కు ఇంకెన్ని షాకులిస్తారో ఆయా నేతలంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం జగన్ కు ఈసారి ఎవరి నుంచి షాక్ తగులుతుందో అనేది.!