సీనియర్ హీరోలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సఖ్యతగా కనిపించినా.. బాలయ్యకు - చిరుకు, నాగార్జునకు-బాలయ్యకు మద్యన ఎంతో కొంత గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీరి సినిమాలు పోటీ పడితే అది కామన్ ఆడియన్స్ కి ఇంట్రెస్టిగ్ గా ఉంటుంది. అందులోను చిరంజీవి, బాలకృష్ణలు మధ్యన బాక్సాఫీసు వార్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.
ఇప్పుడు చిరంజీవి-బాలకృష్ణ-వెంకటేష్ ల మధ్యన బాక్సాఫీసు వార్ షురూ అయ్యింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అంటే సంక్రాంతి సీజన్ కి అందరికన్నా ముందుగా మెగాస్టార్ జనవరి 10 న తన విశ్వంభర సినిమాను విడుదల చెయ్యబోతున్నట్టుగా దర్శకుడు వసిష్ఠతో కలిసి అనౌన్స్ చేసారు. దానికి అనుగుణంగా విశ్వంభర చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
అదే సంక్రాంతికి రిలీజ్ అంటూ అనిల్ రావిపూడి వెంకటేష్ తో సినిమా అనౌన్స్ చేసిన రోజే ప్రకటించాడు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ చాలా స్పీడుగా తెరకెక్కుతుంది. సంక్రాంతి అని చెప్పినా.. అనిల్ రావిపూడి డేట్ లాక్ చెయ్యలేదు.
ఇక నందమూరి బాలకృష్ణ ఈ డిసెంబర్ కి NBK 109 విడుదల చేస్తారు అనుకుంటే. డిసెంబర్లో మెగా హీరోలైన అల్లు అర్జున్ పుష్ప ద రూల్ 6 న, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 న విడుదల కాబోతుండడంతో దర్శకుడు బాబు NBK 109 ని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.
సో 2025 సంక్రాంతి ఫైట్ సీనియర్ హీరోలైన బాలయ్య-చిరు-వెంకీ ల మధ్యన హోరా హోరీగా ఉండబోతుందన్నమాట. గెలుపేవరిది అని ఆలోచించే కన్నా ముగ్గురు సీనియర్లు బాక్సాఫీసు ఫైట్ కి రెడీ అవడమనేది యమా ఇంట్రెస్టింగ్ గా ఉండడం ఖాయం.