Advertisementt

సరిపోదా శనివారానికి అదే పెద్ద ప్లస్

Fri 30th Aug 2024 11:55 AM
sj suryah  సరిపోదా శనివారానికి అదే పెద్ద ప్లస్
SJ Suryah is a big plus for Saripodhaa sanivaaram సరిపోదా శనివారానికి అదే పెద్ద ప్లస్
Advertisement
Ads by CJ

నిన్న గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నాని-వివేక్ ఆత్రేయ ల సరిపోదా శనివారం మూవీకి క్రిటిక్స్ ఎలాంటి రివ్యూస్ ఇచ్చినా, ఎన్ని విమర్శలు చేసినా ఆడియన్స్ నుంచి మాత్రం యునానమస్ హిట్ టాక్ పడిపోయింది. నాని పెరఫార్మెన్స్, ఎస్ జె సూర్య విలనిజం, బ్యాక్ రౌండ్ స్కోర్, వివేక్ ఆత్రేయ మేకింగ్ కి ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులు పడుతున్నాయి.

అయితే సరిపోదా శనివారం చిత్రానికి నాని యాక్టింగ్ ఎంత ప్లస్ అయ్యిందో.. ఎస్ జె సూర్య సైకో విలనిజం అంతే ప్లస్ అయ్యింది. సూర్య విలనీ పాత్రల్లో ఎంత బాగా మెప్పిస్తాడో గతంలో వచ్చిన స్పైడర్, జిగర్తాండ, నెంజం మరప్పదిల్లై, మానాడు ఇలా తనకొచ్చిన విలన్ పాత్రలను సూర్య అత్యంత అద్భుతంగా పెరఫార్మెన్స్ చేసి చూపించాడు. ఇప్పుడు సరిపోదా శనివారం లోను అలాంటి సైకో పోలీస్ పాత్రలో సూర్య చెలరేగిపోయాడు.

ఆస్తి విషయంలో అన్న చేసిన మోసాన్ని భరించలేక కోపం వచ్చినపుడల్లా సోకుల పాలెం అనే ఊర్లోకి వెళ్లి అమాయకులను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టే పాత్ర లో సూర్య పెరఫార్మెన్స్ వేరే లెవల్ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో నేచురల్ స్టార్ నాని ని కూడా సూర్య డామినేట్ చేసాడనే మాట ఆడియన్స్ నోటి వెంట విన్పించడమే సరిపోదా కు అతి పెద్ద ప్లస్ అంటున్నారు.

సూర్య స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతూనే ఉన్నారు అంటేనే సూర్య పెరఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ప్రస్తుతం అదిరిపోయే ఓపెనింగ్స్ తో, సూపర్ హిట్ టాక్ తో సరిపోదా శనివారం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. 

SJ Suryah is a big plus for Saripodhaa sanivaaram:

SJ Suryah  performed the villain role very well in Saripodhaa sanivaaram

Tags:   SJ SURYAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ