Advertisementt

అక్కడ క్లాస్ - ఇక్కడ మాస్

Thu 29th Aug 2024 07:53 PM
coolie  అక్కడ క్లాస్ - ఇక్కడ మాస్
Class there, mass here అక్కడ క్లాస్ - ఇక్కడ మాస్
Advertisement
Ads by CJ

ఈరోజు కింగ్ నాగార్జున బర్త్ డే. అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు అభివాదం చేసిన వీడియో వైరల్ కాగా.. నాగార్జునకు సోషల్ మీడియా నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగార్జున నా సామిరంగా తర్వాత నటిసున్న ప్రాజెక్ట్స్ నుంచి ఆయనకు స్పెషల్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ విష్ చేసారు. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కుబేర సినిమాలో నాగార్జునను క్లాస్ గా చూపిస్తూ పోస్టర్ వదిలారు. అందులో నాగార్జున స్టైలిష్ గా కనిపించారు. ఇక నాగార్జున మరో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలిలోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 

రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో పోషిస్తున్నట్టుగా నాగార్జున పుట్టినరోజున కూలి మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. నాగార్జున ను సైమన్‌గా పరిచయం చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్‌ను ప్రజెంట్ చేస్తోంది. స్టైలిష్ షేడ్స్ మెరుస్తున్న గోల్డ్ వాచ్‌తో కనిపించిన నాగ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. రజనీకాంత్, నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్. నాగార్జున పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు నెక్స్ట్ అప్ డేట్ లో.. 

అలా కుబేరాలో క్లాస్ గా కనిపించిన నాగార్జున ఇక్కడ కూలి చిత్రానికి వచ్చేసరికి మాస్ గా కనిపించి అక్కినేని అభిమానులను కనువిందు చేసారు. 

Class there, mass here:

Coolie 1st Look: Nagarjuna Looks Badass

Tags:   COOLIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ