గత రెండు రోజులుగా వైసీపీ పార్టీకి రాజ్యసభ ఎంపీలు షాకివ్వబోతున్న, జగన్ ను, వైసీపీ పార్టీ ను వదిలి వెళ్లేందుకు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రెడీ అవుతున్నారనే వార్తను నిజం చేస్తూ.. ఈరోజు గురువారం రాజ్యసభ పదవికి, వైసీపీ పార్టీ కి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చెయ్యడం సంచలనంగా మారింది.
పార్లమెంట్ లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ కు వైసీపీ ఎంపీలు ఇరువురు రాజీనామా పత్రాలను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీ పార్టీకి సైతం మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. ఆ ఇద్దరు వైసీపీ ఎంపీల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహస్తే.. బీద మస్తాన్ రావు వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు.
అలాంటి బలమైన నేతలు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకేసారి ఇద్దరు నేతలు అటు పదవికి, ఇటు పార్టీకి ఒకేసారి రాజీనామా చేయడంపై జగన్ మదనపడుతున్నట్లుగా తెలుస్తుంది.