బుట్టబొమ్మ పూజ హెగ్డే కొన్నాళ్లుగా సినిమా సెట్స్ లో కన్నా ఎక్కువగా వెకేషన్స్ లోనే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ వదిలే పూజ హెగ్డే తాజాగా ఫారిన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే అమెరికాలో విహరిస్తోంది. రీసెంట్ గా బుల్లి డ్రెస్ వేసుకుని అడవిలో గడిపిన పూజ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇంకా పూజ హెగ్డే యూఎస్‌లోనే కనిపిస్తూ అందమైన ఫోటో షూట్స్ తో అభిమానులను కనువిందు చేస్తుంది. తాజాగా హాలీవుడ్ రాజధాని లాస్ ఏంజెల్స్ ట్రిప్ వేసింది. కాలిఫోర్నియాలోని అందమైన బీచ్‌లలో సేదతీరుతూ బాడీకాన్ మినీ క్యాజువల్ డ్రెస్‌లో యూత్ ను రెచ్చగొడుతోంది. ఏంటి బుట్టబొమ్మ సినిమాలు కన్నా ఎక్కువగా ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
తెలుగులో అవకాశాలు లేని పూజ హెగ్డే.. కోలీవుడ్ లో సూర్య 44 లో ఛాన్స్ దక్కించుకుంది. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా చిత్రంలోనూ నటిస్తుంది. అయినప్పటికీ పూజ హెగ్డే చూపు తనని స్టార్ ని చేసిన టాలీవుడ్ పైనే ఉంది. ఇక్కడ ఏ హీరో అవకాశం ఇస్తాడా అని ఎదురు చూస్తుంది.