ఉప్పెన చిత్రంతో సునామీలా దూసుకొచ్చిన బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం వరస నిరాశ పరిచే సినిమాలతో అభిమానులని డిజ్ పాయింట్ చేస్తూ వస్తుంది. టాలీవుడ్ లో సక్సెస్ ఇస్తుంది అనుకున్న మనమే చిత్రం కూడా కృతి శెట్టి కి నిరాశే మిగిల్చింది. అయితే ఉప్పెన సూపర్ హిట్ తర్వాత తాను ప్లాప్ లోకి వెళ్లాలని చాలామంది కోరుకున్నారు.
ఉప్పెన హిట్ తర్వాత ఒక వర్గం నాకు ప్లాప్ రావాలని కోరుకుంది. ప్లాప్ వస్తే నన్ను విమర్శించాలని చూసారు అంటూ సన్సెషనల్ కామెంట్స్ చేసింది. కానీ నేను సక్సెస్ అయినా లేదంటే ప్లాప్ అయినా దేనినైనా ఒకేలా తీసుకున్నాను. ఉప్పెన క్రెడిట్ ని నేను ఒక్కదాన్నే తీసుకోలేదు. కాబట్టి ప్లాప్ వచ్చినా ఆ క్రెడిట్ నేను ఒక్కదాన్ని ఎందుకు తీసుకోవాలి.
ప్లాప్ వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాను, సక్సెస్ కంటే ప్లాప్ వల్లే పాఠాలు నేర్చుకున్నాను, సినిమా ఎందుకు ఆడలేదు అనే విశ్లేషణ నాకు బాగా పనికొచ్చింది. అందుకే విమర్శలు తీసుకుని మరింత స్ట్రాంగ్ గా తయారయ్యాను అంటూ కృతి శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.