బిగ్ బాస్ మొదలైన ఏడాది అంటే ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన ఏడాది దానిని హైదరాబాద్‌లో కాకుండా పూణేలో హౌస్ సెట్ వేసి నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడ సినిమా షూటింగ్ చేసుకుంటూ బిగ్ బాస్‌కి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేసి గత కొన్ని సీజన్స్‌ని ఇక్కడే నిర్వహిస్తున్నారు.
అయితే హైదరాబాద్‌లో సెట్ ఉండడం, బిగ్‌బాస్ ఎడిటింగ్ టీం లో కొంతమంది కావాలనే వారం వారం ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్ పేర్లు ముందుగా లీక్ చెయ్యడం, అలాగే చాలా విషయాల్లో బిగ్ బాస్ యాజమాన్యాన్ని లీకులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. శని, ఆదివారాలు ఎపిసోడ్స్ షూట్ ముందే చెయ్యడం, ఆ ఎపిసోడ్స్ రాత్రి పూట ప్రసారమవడంతో అక్కడ జరిగే ప్రతి విషయము స్టార్ మా ప్రోమోస్ ద్వారా కాకుండా లీకుల ద్వారా బయటికొచ్చేస్తున్నాయి.
అందుకే ఈసారి సీజన్ 8 విషయంలో ఆ లీకులు లేకుండా యాజమాన్యం ముందే జాగ్రత్త పడుతుందా అనేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నిన్నటివరకు బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్ అంటూ చక్కర్లు కొట్టిన దానిలో ఇప్పుడు హౌస్‌లోకి వెళ్లబోయే వారికి పొంతన లేదు అంటున్నారు.
కారణం బిగ్ బాస్ యాజమాన్యం ఏది లీకవ్వకుండా గుట్టును మెయింటైన్ చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఫైనల్ బిగ్ బాస్ 8 లోకి అడుగుపెట్టేబోయే వారు ఎవరు అనేది మాత్రం ఆదివారం సాయంత్రమే రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.