Advertisementt

కవిత తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాధించలేదు

Wed 28th Aug 2024 04:01 PM
kavitha  కవిత తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాధించలేదు
Kavita has not achieved anything for the state of Telangana కవిత తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాధించలేదు
Advertisement
Ads by CJ

ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో ఐదునెలల జైలు జీవితం తర్వాత గత రాత్రి తీహార్ జైలు నుంచి పది లక్షల పూచి కత్తుపై బెయిల్ పై విడుదలైంది. కవిత కి బెయిల్ రాగానే BRS నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ తెగ హడావిడి చేసారు. KTR, హరీష్ రావు లు నిన్నంతా ఢిల్లీలోనే మకాం వేసి కవితకు బెయిల్ వచ్చేలా చెయ్యడంలో సఫలీకృతలయ్యారు.

కవిత జైలు కి వెళినప్పటి నుంచి ఒక్కసారి కూడా కుమార్తెను పరమర్శించడానికి కెసిఆర్ వెళ్ళలేదు. ఇక్కడ MP ఎలెక్షన్స్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కొట్లాటలు వీటన్నితో బిజీగా వున్న గులాబీ నేత బిడ్డ జైలు లో ఉన్నప్పటికీ ఆమెని కలవడానికి వెళ్ళకపోవడంపై పలువురు పలురకాలుగా మాట్లాడుకున్నారు. కొన్ని నెలలుగా కవితకు బెయిల్ కోసం BRS ప్రయత్నాలు చేస్తుంది.

ఇక నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత న్యాయం గెలిచింది, ఇకపై కొత్త కవితను చూస్తారు. ఇప్పటి వరకు నేను మొండిని, ఇకపై జగమొండిగా మీ ముందుకు రాబోతున్నాను అని తానేదో ప్రజల కోసమే జైలుకి వెళ్లినట్టుగా మాట్లాడితే.. BRSనేతలు, కార్యకర్తలు బయట సంబరాలు చేసుకోవడం చూసిన వారు అరే కవిత తెలంగాణ రాష్ట్రం కోసమో, లేదంటే ప్రజల కోసమో జైలు కు వెళ్ళలేదు. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళింది.

ఆమె ఏదో రాష్ట్రానికి సాధించేసింది అన్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె వెళ్ళింది లిక్కర్ కుంభకోణంలో. అది ఆమె పర్సనల్. అది రాష్ట్రానికి సంబంధం లేదు. కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళితే మీరేమో.. ఆమె ఏదో ఉద్దరించేసింది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారేమిట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Kavita has not achieved anything for the state of Telangana:

Netizens Comments Kavitha goes to jail in liquor scam Not For Telangana 

Tags:   KAVITHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ