రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో ఆగష్టు 15 న భారీ అంచనాల నడుమ విడుదలైన మిస్టర్ బచ్చన్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. భాగ్యశ్రీ బోర్సే అందాలను ఆడియన్స్ కి ఎర వేసిన హరీష్ శంకర్ కి ఆ ఆడియన్స్ నుంచే తెగ విమర్శలొచ్చాయి.
హీరోయిన్ అందం, ఆమె గ్లామర్ పై పెట్టిన ఫోకస్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కంటెంట్ పై పెట్టి ఉంటే గనక సినిమా రిజల్ట్ మరోలా ఉండేది, అంతేకాదు ప్రెస్ మీట్లలోనూ గొప్పలు పోయిన హరీష్ శంకర్ కి ఈ మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఓ గుణపాటమంటూ కొంతమంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఇక థియేటర్స్ లో నిరాశ పరిచిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై అందరిలో అనేకంటే రవితేజ అభిమానుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది అని చెప్పాలి. అయితే మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్నివినకయ చవితి అంటే మిస్టర్ బచ్చన్ థియేటర్స్ లో విడుదలైన మూడు వారాల్లోగా సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
సో మరో వారంలో మిస్టర్ బచ్చన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు ఓటీటీ ప్రేక్షకులు గేట్ రెడీనా మిస్టర్ బచ్చన్ ని ఇంట్లో కూర్చుని చూసేందుకు..!