ఇస్మార్ట్ శంకర్ తర్వాత అందులో నటించిన హీరోయిన్స్ లో ఒకరైన నిధి అగర్వాల్ ఇకపై టాలీవుడ్ ని దున్నేస్తుంది, ఏలేస్తుంది అని ఆమె అభిమానులు కలలు కన్నారు. ఆ సినిమా హిట్ అవడంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, నభ నటేష్ ల అందాల విందు కూడా చాలావరకు ప్లస్ అయ్యింది. అందుకే హీరయిన్స్ బాగా క్లిక్ అవుతారనుకున్నారు.
కానీ నిధి అగర్వాల్ ని పెద్దగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు మొదలు పెట్టింది. అది ఎప్పుడు పూర్తవుతుందో అని ఆమె ఎంతగా ఎదురు చూస్తుందో తెలియదు కానీ.. వీరమల్లు మేకర్స్ మాత్రం చాలా ఆతృతగా కనబడుతున్నారు. ఇక ప్రభాస్ తో రాజా సాబ్ లో జోడి అనుకుంటే అందులో ముగ్గురు హీరోయిన్లు.
ముగ్గురు హీరోయిన్లు అంటే నిధి అగర్వాల్ పాత్ర ప్రాధాన్యత ఓ అంచనా వెయ్యొచ్చు. మరి ఈ తరహా పాత్రలకే నిధి అగర్వాల్ పరిమితమవుతుంది కానీ.. యంగ్ హీరోలెవరూ నిధి అగర్వాల్ ని పట్టించుకోవడం లేదు. ఆమె అందమైన, గ్లామర్ ఫోటోషూట్స్ బయటికొచ్చినప్పుడల్లా ఈ అందాల నిధిని పట్టించుకోరే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజా ఆమె వదిలిన పిక్స్ చూస్తే పింక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో నిధి అందాలు ఎలా ఉన్నా మెస్మరైజ్ చేసే చూపులతో మత్తెక్కించేసింది అంటూ కామెంట్ చెయ్యడం అయితే పక్కా.. మరి మీరు నిధి అందలవైపు ఓ లుక్కెయ్యండి.