Advertisementt

శోభితతో పెళ్ళెక్కడ.. నాగ చైతన్య ఆన్సర్

Wed 28th Aug 2024 11:39 AM
naga chaitanya  శోభితతో పెళ్ళెక్కడ.. నాగ చైతన్య ఆన్సర్
Naga Chaitanya: I will soon reveal my wedding details శోభితతో పెళ్ళెక్కడ.. నాగ చైతన్య ఆన్సర్
Advertisement
Ads by CJ

శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్ట మొదటిసారి నాగ చైతన్య మీడియా ముందుకు వచ్చాడు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన చైతూని మీడియా వదులుతుందా.. నిన్నగాక మొన్న నాగార్జున N కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేతపై అలాగే శోభిత దూళిపాళ్లతో పెళ్లిపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. 

నాగ చైతన్య మాత్రం కూల్ గా హడావిడి లేకుండా N కన్వెన్షన్ పై నాన్న సోషల్ మీడియాలో ట్వీట్ వేశారు. ఇంక దానిపై మాట్లాడడానికి ఏమి లేదు. ఇక శోభిత తో పెళ్లి విషయమై చైతూని మీడియా పెళ్లి ఎప్పుడు, అది హైదరాబాద్ లోనా, లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుందా అంటూ నాగ చైతన్య ని అడిగింది మీడియా. 

దానికి చైతు.. పెళ్లంటే నా మనసుకు దగ్గరైన వాళ్లంతా ఉండాలి, మన సంస్కృతి , సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేదానిపై త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని అంటూ చైతు పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని చెప్పకుండానే దాటవేశాడు.  

Naga Chaitanya: I will soon reveal my wedding details:

Where is Sobhita married.. Naga Chaitanya answer

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ