దేవర నుంచి వచ్చిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దేవర ముంగిట నువ్వెంత, చుట్టమల్లే సాంగ్ అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల డాన్స్ కి అందరూ ముగ్దులయ్యారు. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కెమిస్ట్రీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎగ్జైట్ అవుతూనే ఉన్నారు.
ఇప్పుడు దేవర నుంచి మరో పాటకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్ర నుంచి రాబోతున్న దేవర మూడో పాట ఎప్పుడు వస్తుందో చెప్పలేను కానీ.. మూడో పాట, పాట కు మించిన ఆట, కన్నుల పండగ, ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు, ఎప్పుడని అడక్కండి, ఎప్పుడొచ్చినా భీభత్సమే ❤️ పక్కా, ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అంటూ లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారు వేసిన ట్వీట్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు.
మరి జోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా పాట ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ మాత్రం పక్కా అన్నమాట. దేవర విడుదలకు మరొక్క నెల ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతూ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొరటాల ఆ శుభముహుర్తం ఎప్పుడు పెడతారో చూడాలి.