జగన్ కి వైసీపీ కి బై బై చెప్పేసి పార్టీ జెండాను, జగన్ బొమ్మను పీకేసిన రోజా. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడుతున్న వార్త. రోజా ను వైసీపీ వదిలించుకుందో.. లేదంటే రోజా నే వైసీపీకి దూరమైందో తెలియదు కానీ.. అన్నా అంటూ జగన్ వెంట నడిచి, జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్షాలను అనకూడని మాటలతో చెలరేగిపోయిన రోజా జగన్ కి హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది.
అందులో భాగమే రోజా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వైసీపీ పార్టీ లోగో, పేరు, జగన్ ఫొటోస్, పేరు లేకుండా డిలేట్ చెయ్యడం అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రోజా ఇకపై జగన్, వైసీపీ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో దూరం కాబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కాబట్టే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన బయో లో జగన్ పేరు, వైసీపీ పార్టీ పేరు కూడా కనిపించకుండా చేసేసింది అంటున్నారు. మీడియా ముందు, రాఖీలు కట్టడం, అసెంబ్లీ లో కూడా అన్న అంటూ జగన్ మెప్పు కోసం పాకులాడడం అన్ని ఏమైపోయాయి రోజమ్మా.. ఇలా జగన్ ని మోసం చేసావ్ అంటూ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
వైసీపీ కూడా రోజాను దూరం పెడుతుంది, అందుకే నగరి ఇంచార్జ్ గా రోజా పేరు ఇవ్వలేదు అంటుంటే.. ఆ కోపం మీదే రోజా వైసీపీ, జగన్ పేర్లు తీసేసి కేవలం ఎక్స్ ఎమ్యెల్యే, ఎక్స్ మినిస్టర్ అని మాత్రమే ఉంచుకుంది అంటూ మాట్లాడుకుంటున్నారు, ఏది ఏమైనా ఓటమి తర్వాత రోజా అసలు రంగు బయటపడింది అనే మాట మాత్రం బాగా వినిపిస్తుంది.