అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిని సపోర్ట్ చెయ్యడం పై మెగా ఫ్యామిలీలోనే చాలామందికి నచ్చలేదు. మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ ఇద్దరూ అల్లు అర్జున్ పై పీకల దాకా కోపం పెంచుకుని ఉన్నారు. అటు జనసేన నేతలు, ఎమ్యెల్యేలు, కార్యకర్తలు అందరూ అల్లు అర్జున్ పై గుర్రుగానే ఉన్నారు. అల్లు అర్జున్ ఈమధ్యన కూడా నాకు నచ్చితేనే చేస్తాను, నాకు నచ్చితే వస్తాను అంటూ కాస్త తిరకాసుగా మట్లాడడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
ఇప్పుడు ఈవ్యవహారం పొలిటికల్ హీట్ గా మారింది. జనసేన ఎమ్యెల్యే అయిన బోలిశెట్టి శ్రీని అల్లు అర్జున్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. నేను పెద్ద పుడుంగిని ఇష్టమయితనే వస్తా.. మానేయ్ వెల్లిపో ఎవరు అడిగారు నిన్ను, మేం 21 కి 21 గెలిచాం.. నువ్వు వెళ్లిన YCP MLA ని గెలిపించావా? మీ నాన్న ఎంపీ గా నిలబడితే నువ్వు గెలిపించావా? అల్లు అర్జున్ కంటూ ఫాన్స్ లేరు.. ఉంది మెగా ఫ్యాన్సే .. ఆయన ఊహించుకుటున్నాడేమో ఉన్నారని.. అంటూ శ్రీను చేసిన కామెంట్స్ వైరల్ వైరల్ అయ్యాయి.
దానికి వైసీపీ అనుకూల మీడియా.. సినిమా వాళ్ళను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది అన్నారు, కానీ ఇప్పుడు జనసేన MLA
బొలిశెట్టి శ్రీను నే స్వయం గా అల్లు అర్జున్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ ఏమి.. అధికార ప్రభుత్వాన్ని విమర్శించలేదు కూడా, ఇది టార్గెట్ చెయ్యడం కాదంటారా? అంటూ ట్వీట్ చేసింది.
దానికి బొలిశెట్టి శ్రీను రీ ట్వీట్ చేస్తూ.. అల్లు అర్జున్ పై జనసేన నాకు ఇష్టమైతే నేను వస్తా - ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని కానీ, నాగబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే ఖచ్చితంగా వస్తా! మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమనగా.. నా వాక్యాలు పూర్తిగా వ్యక్తిగతం! ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా గమనించగలరు.. అంటూ కౌంటర్ వేసాడు ఆయన.