టాలీవుడ్ లో సునామీలా దూసుకొచ్చిన శ్రీలీల స్పీడుకు యంగ్ హీరోలు బ్రేకులు వేశారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా.. పాత్ర పరిధి, పాత్ర తీరుతెన్నులు తెలుసుకోకుండా వరస సినిమాలు ఒప్పేసుకుని బోర్లా పడిన శ్రీలీల మరోసారి బిజీ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే నితిన్, రవితేజ సినిమాల ఆఫర్స్ ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ విషయం ఇంకా తేలడం లేదు. ఈలోపు శ్రీలీల కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమ్మడు లక్కీ అనుకునే లోపు శ్రీలీల కు కోలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ తగిలింది అనే టాక్ నడుస్తుంది. సుధా కొంగర దర్శకత్వంలో హీరోగా సూర్య నటించాల్సిన చిత్రంలో శ్రీలీల ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. కాకపోతే ఈ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నాడు.
సుధా కొంగర తెరకెక్కించబోయే పురాననూరుని లో సూర్య ప్లేస్ లో శివ కార్తికేయన్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. సుధా కొంగర సినిమాల్లో హీరోయిన్ కు నటనపరంగా ఎంత ప్రాధాన్యంఉంటుందో ఆమె గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది. మరి ఇప్పుడు సుధా చేతిలో శ్రీలీల పడితే ఆమెను లక్కీ అనాల్సిందేగా..!