వచ్చే ఆదివారం నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్లబోయే వారి పేర్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్ పేరు హైలెట్ అయ్యింది. ఈమధ్యన మాజీ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో రాజ్ తరుణ్ పేరు ఎంతెలా చక్కర్లు కొట్టిందో చూసారు.
అటు కెరీర్ పరంగాను బాగా డల్ అయిన రాజ్ తరుణ్ నిజంగానే బిగ్ బాస్ 8 హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. లావణ్య వ్యవహారం హాట్ హాట్ గా ఉన్న సమయంలో రాజ్ తరుణ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ కి క్రేజ్ వస్తుంది అని రాజ్ తరుణ్ ని యాజమాన్యం ఒప్పించినట్టుగా చెప్పుకుంటున్నారు.
అయితే రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీ పై సస్పెన్స్ వీడింది. ఈరోజు రాజ్ తరుణ్ నటిస్తున్న భలే ఉన్నాడే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ కి వెళుతున్నారటగా అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి రాజ్ తరుణ్ కాకుండా ఆయన డైరెక్టర్ శివ సాయి రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ సెట్ అవదు. అతను ఒక చోట నిలబడే వ్యక్తి కాదు, అసలు రాజ్ తరుణ్ ఎప్పటికి బిగ్ బాస్ కి వెళ్ళడు,
బిగ్ బాస్ అంటే రాజ్ తరుణ్ కి ఇంట్రెస్ట్ లేదు అంటూ రాజ్ తరుణ్ బిగ్ బాస్ గాసిప్స్ కి అడ్డుకట్ట వేశారు. సో ఈ సీజన్ లో రాజ్ తరుణ్ ని చూస్తామనుకుంటున ప్రేక్షకులకు ఈ న్యూస్ డిజ్ పాయింట్ అనే చెప్పాలి.