పవన్ కళ్యాణ్ కోసం ఆయన నిర్మాతలు ఏమైనా చేసేలా ఉన్నారు. ఆయనతో సినిమాలు నిర్మిస్తుండగా.. పవన్ కళ్యాణ్ మధ్యలో పాలిటిక్స్ తో బిజీ అవడం, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అవడంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కాస్త టెన్షన్ పడ్డారు. కానీ మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ వారి చిత్రాలను పూర్తి చేస్తామని మాటిచ్చారు.
గత వారం ఆయనతో సినిమాలు చేస్తూ మధ్యలో ఇరుక్కున్న నిర్మాతలు అంటే హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి డేట్స్ అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా చాలా తక్కువ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న OG నిర్మాతలు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ బాధ్యతలను గుర్తుంచుకుని ఆయన కోసం OG ని విజయవాడలో పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న OG షూటింగ్ ఎక్కువగా ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగింది. అందుకే ఇప్పుడు OG కోసం ముంబై సెట్ ని విజయవాడలో వేసి మిగతా షూటింగ్ విజయవాడలోనే కంప్లీట్ చెయ్యాలని, అప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఇబ్బంది ఉండదు అని OG మేకర్స్ ఆ ఏర్పాట్లలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.