ప్రభాస్ తో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ ఎప్పుడెప్పుడు సినిమాని స్టార్ట్ చేస్తాడా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ మూడు చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ చిత్రంపై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు. అందుకే అభిమానుల ఆత్రుత.
ఈ చిత్రం ఈ ఏడాదే మొదలు పెడుతున్నట్టుగా సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ప్రస్తుతం తన చేతిలో రెండు ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికి సంబందించిన ప్లానింగ్ కూడా పూర్తయ్యింది. అందులో భాగంగా నాలుగేళ్ళ పాటు తన ప్లానింగ్ మొత్తం రెండు బిగ్ ప్రాజెక్ట్స్ అయిన స్పిరిట్, యానిమల్ పార్క్ కే సరిపోతుంది.
స్పిరిట్ ని ఈ ఏడాదే సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాము, ఈ చిత్రాన్ని రెండేళ్లలో పూర్తి చేసి 2026 లో విడుదల చేస్తున్నట్టుగా సందీప్ రెడ్డి వంగ అఫీషియల్ గా ప్రకటించాడు. స్పిరిట్ తర్వాతే తాను యానిమల్ పార్క్ పై సృష్టి పెడతాను అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు. అన్నట్టు స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఫస్ట్ టైమ్ కనిపించబోతున్న విషయం తెలిసిందే.