రామ్ చరణ్ వారసురాలు, మెగా మనవరాలు క్లింకార మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఫ్యామిలీ ఏ ఫెస్టివల్ అయినా, లేదంటే ఏ పార్టీ సెలెబ్రేషన్స్ అయినా గ్రాండ్ గా నిర్వహిస్తుంది. గత ఏడాది వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు, ఈ ఏడాది ఉగాది వేడుకల నుంచి నిన్న జరిగిన క్రిష్ట్నాష్టమి వేడుకల వరకు అన్నిటిలో క్లింకార హైలెట్ అవుతూనే ఉంది.
నిన్న జరిగిన జన్మాష్టమి వేడుకల్లో తల్లి ఉపాసనతో కలిసి బుల్లి క్లింకార కృష్ణుడు ముందు పూజ చేస్తూ కనిపించింది. అయితే ఇప్పటివరకు చరణ్ దంపతులు తమ కుమార్తె మొహాన్ని రివీల్ చెయ్యకుండా సైడ్ లుక్, బ్యాక్ లుక్ అంటూ మెగా అభిమానులను తెగ ఊరిస్తున్నారు.
మార్చ్ లో చరణ్ బర్త్ డే కి తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో ఉపాసన అనుకోకుండా క్లింకార మొహాన్ని చూపించెయ్యడం, పాప అచ్చం చరణ్ పోలికలతో కనిపించడం అన్ని మెగా అభిమానులను సంతోష పెట్టాయి. ఇక క్లింకార జన్మాష్టమి వేడుకల ఫొటోస్ మీ కోసం..