అల్లు అర్జున్ హైదరాబాద్ లోని కాస్ట్లీ ఏరియా అయిన జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ఏరియాలో కొత్త ఇల్లు కోసం బిల్డింగ్ ను కడుతున్నాడా, అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ద రూల్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోపక్క తన అభిరుచులకు తగ్గట్టుగా ఓ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
సుమారు 3000 చదరపు అడుగుల వైశాల్యంలో అన్ని సదుపాయాలు అంటే స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇలా ప్రత్యేక సదుపాయాలతో అల్లు అర్జున్ తన ఇంటి ని నిర్మించుకున్నాడట. ఇప్పటికే 60 శాతం పూర్తయిన ఆ ఇంటికి అల్లు అర్జున్ త్వరలోనే ఓ మాంచి ముహూర్తం చూసుకుని సతి సమేతంగా గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వినికిడి.
కృష్ణంరాజు గారి ఇంటి సమీపంలో బన్నీ కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది అని, అల్లు అర్జున్, ఆఫీస్ అలాగే ఇంటికి అనువుగా ఆ బిల్డింగ్ ని డిజైన్ చేయించుకున్నాడని తెలుస్తోంది. సో అల్లు అర్జున్ ఇప్పుడుంటున్న ఇంటి నుంచి అతి త్వరలోనే తన కొత్తింటికి భార్య సమేతంగా వెళ్ళిపోతాడన్నమాట.