కోలీవుడ్ నటి కీర్తి సురేష్ ఇప్పుడు తన రూట్ ని పూర్తిగా మార్చేసింది. ట్రెడిషనల్ వేర్ నుంచి పూర్తి గ్లామర్ గర్ల్ గా టర్న్ అయ్యింది. సోషల్ మీడియాలో వరస ఫోటో షూట్స్ తో అందులోను అందాలు ఆరబోస్తూ కిక్ ఇచ్చే స్పెషల్ షూట్స్ తో అభిమానులను మెస్మరైజ్ చెయ్యడం కాదు.. యూత్ చొంగ కార్చుకునేలా చేస్తుంది.
కీర్తి సురేష్ నార్త్ లో అడుగుపెట్టక ముందే లుక్ మార్చేసింది. నార్త్ లో అడుగుపెట్టాక మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో ఈమధ్యన కీర్తి సురేష్ షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. తాజాగా కీర్తి సురేష్ కత్తిలాంటి ఫొటోస్ షేర్ చేసింది. చీర కట్టులో కీర్తి సురేష్ అదిరిపోయే ఫోజులతో కిక్ ఇచ్చింది.
రఘు తాత మూవీ ప్రమోషన్స్ కోసం బయలుదేరిన కీర్తి సురేష్ తన కొత్త స్టయిల్ ని ఫొటోస్ రూపంలో షేర్ చేసింది. నిజంగా కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్ చూస్తే యూత్ కి నిద్ర కూడా పట్టదు. వి నేక్ బ్లౌజ్ లో కీర్తి సురేష్ శారీ లుక్ చూడగానే హమ్మ కీర్తి సురేష్ ఇంతలో ఎంత మార్పు అని అనకమానరు.