పుష్ప 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు ఫినిష్ అవుతుందా అని అల్లు ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. సుకుమార్ కూడా మీరెవరూ డిస్టర్బ్ చెయ్యకపోతే షూటింగ్ సక్రమంగా పూర్తి చేస్తామని చెప్పారు. అల్లు అర్జున్ అయితే హుషారుగా పుష్ప 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
రీసెంట్ గానే క్లైమాక్స్ జాతర పూర్తయ్యింది. దానితో అల్లు అర్జున్ అభిమాని ఒకరు పుష్ప 2 ఈ క్లైమాక్స్ షూట్ ఎలా వచ్చిందని అడిగాడు. దానికి పుష్ప2 మేకర్స్ ఇంట్రెస్టింగ్‌గా అదిరిపోయేలా సమాధానం ఇచ్చారు. పోతారు.. మొత్తం పోతారు.. అనే డైలాగ్‌తో పుష్ప2 మేకర్స్ పుష్ప 2 క్లైమాక్స్ పై పెంచిన అంచనాలు నెట్టింట వైరల్ అవుతోంది.
పోతారు.. మొత్తం పోతారు.. అనే డైలాగ్ ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యింది. హీరో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం చిత్రంలో నాని చెప్పిన డైలాగ్ పోతారు.. మొత్తం పోతారు.. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఆ డైలాగ్ తో పుష్ప 2 మేకర్స్ పుష్ప 2 క్లైమాక్స్ గురించి చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.