Advertisementt

ప్రేమ అనేది ఓ త్యాగమంటున్న సమంత

Mon 26th Aug 2024 04:05 PM
samantha  ప్రేమ అనేది ఓ త్యాగమంటున్న సమంత
Samantha shares love tips ప్రేమ అనేది ఓ త్యాగమంటున్న సమంత
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో విడిపోయాక సమంత ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. మధ్యలో అనారోగ్య సమస్యలతో పాటుగా, మానసిక ఆవేదనను ఫేస్ చేస్తున్న సమంత ప్రస్తుతం కెరీర్ కి బ్రేక్ తీసుకుని మరోసారి షూటింగ్స్ కి హాజరవ్వడానికి సిద్ధమైంది. మరోపక్క బిజినెస్ వ్యవహారాలతోను సమంత బిజీ అయ్యింది.

సమంత ఏం చేసినా, ఎంత బిజీగా కనిపిస్తున్నా ఆమె మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి విషయమై ఏమైనా సందిస్తుందేమో.. చైతు-శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ పై ఎలా రియాక్ట్ అవుతుందో అనే విషయంలో అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఆగస్టు 8 న ఎంగేజ్మెంట్ జరిగితే.. కాస్త గ్యాప్ తీసుకుని సమంత తాజాగా ప్రేమ అంటే త్యాగమంటూ ఓ పోస్ట్ పెట్టింది.

చాలామంది స్నేహాలను, తత్సంబందాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దానిని నేను కూడా నమ్ముతాను. మీరు ప్రేమను ఇస్తాను, నేను అందుకుంటాను, తిరిగి ఇస్తాను, కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏమిటంటే.. మనం ప్రేమను పంచినా ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మన ప్రేమను ఇస్తాము.

ఎందుకంటే ప్రేమ అంటేనే ఓ త్యాగం, మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, ఆప్యాయతలు పొందకపోయినా.. ఇప్పటికి ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతఙ్ఞతలు అంటూ సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Samantha shares love tips:

Samantha Cryptic Post Hints at Lessons Learned in Love and Relationships

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ